అంతగా ఏముంటాయి అనుకుంటాను
ప్రేమలూ దుఃఖాలూ కలవడాలూ విడిపోవడాలూ అన్నీ వస్తూ పోతూ జీవితపు సంరంభంలో కాస్సేపు మెరసి అలా వెళ్ళిపోయేవే కదాని
ఒక ఊహ
కొనసాగించడానికి మాటల ముక్కు మూసి తలకిందులుగా నానా విన్యాసాలు చేసి
ఒకానొక స్థితిలో నన్ను నేను సరిపుచ్చుకొని-
ఇంతా చేసి చేస్తున్నదేమిటి
తామరాకులనంటిన నీటిబిందువుల అద్దంలో ప్రతిఫలించే ముఖాలను వెర్రిగా మోహించడం
దగ్ధమయ్యేందుకే పునః పునః తలనెత్తడం
దగ్ధమయ్యేందుకే పునః పునః పుట్టడం.
రిప్లయితొలగించండిబాగు బాగు.