ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని
ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు
దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను
ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను
దిగంతాలకు పరిచినట్టో
ఒక దృగ్విషయపు లోతులకు దూకి
పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా
అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా
సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ
జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ
నేర్చుకుంటున్న నా బిడ్డ అడిగిన ప్రశ్నకు నా దగ్గర మాటలు లేవు
దుఃఖం కూడా స్థంభించి లోపలి అరలలో దగ్ధమవుతున్న మంట
పేగులు తెగి దేహం ఒరుసుకపోతూ స్థల కాలాదులను అధిగమించి విస్తరించే గాయపు స్పృహ
మెదడు రసి కారుతున్న పుండులా జిగటలు వారుతోంది
ఈ రోజును పెగల్చుకపోయే ఒకలాంటి మౌనంతో మూసి ఉంచగలను గానీ
బహుశ కొన్నాళ్ళకు ఆమెకు ఇలా చెబుతాను
తల్లీ, ఇది పవిత్ర భూమి
అయితే ఇక్కడ యోనులలో తాగి పడేసిన సీసాలను జొనుపుతారు
స్త్రీలను తల్లిగా చెల్లిగా పూజించడంతో పాటుగా
మర్మాంగాలను కర్రలు, కడ్డీలు పెట్టి తిప్పినా కుతి తీరని మార్మిక రంద్రాంశాలుగా తలపోస్తారు
గఢీలలో తెలియని కోటగోడల ఆవల
సత్యాహింసలను ప్రబోధించిన మహాత్ముల శిలాహృదయాల ముందర
బరిబాతల భయ విహ్వల విహంగమై ముడుచుక ముడుచుక పోయి నీ దేహం వందే మాతరమని నినదించి ప్రాధేయపడింది
గుజరాత్ కాషాయపు నడి బజార్లలో కశ్మీర్ ప్రాయపు విచ్చిత దేహాంగాలలో తలవొంచని ఈశాన్యపు గాలులలో
దేశభక్తి మువ్వన్నెల జెండాగ మురిసి మన గగనాలను అలంకరించింది
పట్టెడు మెతుకులు అడిగినపుడో
ఒక విశ్వాసం ఊపిరిగా నిలబెట్టినపుడో పట్టి పట్టి పాలిండ్లను పిసికి బాలింతతనానికి పరీక్షలు పెట్టింది
ఒకటేమిటి, దేశమే ఒక ప్రశ్నగా మారి సందేహం వచ్చిన ప్రతీసారీ
తనను తాను పోల్చుకోవలసివచ్చిన ప్రతి సందర్భమూ
తొడల మధ్యన ఆవిరులెత్తే ఉన్మాదపు మృగయానందమై చిందులు వేసింది
ఒకరిద్దరు కాదు
ఒక్క సందర్భమూ కాదు
ఈ పూటకు దహించి నిలుచుని చీల్చుక పోయే జీవితపు క్షణాలను అనుభూతికి తెచ్చిన మన సగం ఆకాశమని తనకు జవాబు చెబుతాను
ఒక కాలానికి
రాజ్యమే నగ్నతను సింగారించుకున్న అంగమని తను తెలుసుకుంటుంది
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిమాటలు లేవు ,రావడం లేదు.తలలు నేల పడిన చోటునే సిగ్గుతో తలవంచుకునే రోజులు ఇవి.
రిప్లయితొలగించండివేదన తొణికిసలాడుతూ ఉన్న కవిత్వం. దుఃఖం మరింత ముచుకొస్తుంది.
మాహాద్భుతమైన భావావేశం....మాటల్లేవు రావు.
రిప్లయితొలగించండికవితగా వివరించినంత తేలిక కాదు చెప్పటం....ఒక రకంగా తండ్రికి సమాధానం చెప్పటం సంకటమైనదే....ఇంతకంటె కూడా మహా దారుణంగా హించించటం< ఖండఖండాఉగా కోసి పడెయటం, జుగుప్స కలిగించే చేష్టలను కూడ చూడవల్సి వస్తోంది.
రిప్లయితొలగించండిchaalaa dhukhangaa undi ...love j
రిప్లయితొలగించండిwell expressed
రిప్లయితొలగించండిTears flowig from my eyes, my mind has become blank.Amma I am ashamed for being a man.
రిప్లయితొలగించండిArun
మగాడిగా పుట్టిన అదృష్టానికి సిగ్గుపడి, ఇద్దరు అమ్మాయిల తండ్రినైన భాగ్యానికి గర్వపడి, అంతలోనే తెలియని భయాల కుంగిపోయేలా చేసింది మీ కవిత.. Thanks Nagaraju
రిప్లయితొలగించండిgaru