మూడు తరాల జీవితం
కొందరు స్త్రీలు
కొందరు పురుషులు
ఒక్కో దాన్నీ దాటుకుంటూ
ఊరు వెంట ఊరు
మజిలీ వెంట మజిలీ
జాడలేవీ మిగిలి లేవు
నడచిన దారిని తుడుచుకుంటూ
అడుగు వెంట అడుగు
రోజులు మరుగున పడిన ఙ్ఞాపకాలు
యతలు సుషుప్తిలో జోగుతున్న శకలాలు
మనుషులు ఒకప్పుడు ఎక్కడో
సొంతమన్నది ఏమీ లేక తిరిగి తిరిగి
మట్టి గర్భంలో పొరలు పొరలుగా మలిగిపోతున్న ఘోషలు
అనామకత్వం
ఎప్పటికీ చెరిగిపోని సంతకం
ఎక్కడా ఒక గుర్తు కూడా లేకుండా చెరిగి పోవడం
ఒక స్మృతి గీతికకు గొంతు కలిపి పాడడం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి