కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం
ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో
చెరిపేస్తే చెరగదు ఆపేస్తే ఆగదు
చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర
ఇది తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోలోపల పోగు పడిన దానినంతా
కడిగి పారేసే కుండపోతవదు
సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా
చదివే పంక్తుల నడుమ విరామమై
నడిచే పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ధ గానమో
ఇది ఎంతకూ తెగదు
ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా
ఇది సృజన
ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు
చాలా బాగుందండి.
రిప్లయితొలగించండి