ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు
ఏకాంతం
దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు
పాట
చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం
ఊహ
అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి
కవిత
రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం
మనిషి
రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం
రిప్లయితొలగించండిమనిషి
ప్రతి వాక్యం చాలా అందంగా అర్థ వంతంగా ఉన్నాయండి.
చాలా నచ్చింది.
రిప్లయితొలగించండిఅభినందనలు.