నల్లటి పలక మీద
ఎవరో కాసిని నవ్వులు రాల్చి పోయారు
ఒక దోబూచులాటలా
పిడికిలి బిగించి చూపుడు వేలితో
ఏవో సంకేతాలు కొన్ని అస్పష్టంగా వదిలి పోయారు
దబ దబా పరిగెత్తే పాదాలు
అడుగు పెట్టిన ప్రతి చోట అద్భుతాలు కురిపించే పాదాలు
బడిలో నేనొక్కడినే
ఆ పాదాల సవ్వడి వింటూ పలక మీదకు వంగి చూస్తుంటాను
తెల్లగ గీచిన గీతల నడుమ
ఎవరిదో నడకలు నేర్వని అడుగొకటి
రెల్లు పువ్వయి నవ్వి ప్రేమగ నా చెంపలు సవరిస్తోంది
పలక మీద నవ్వులు రాల్చి ----
రిప్లయితొలగించండిరెల్లుపువ్వయి నవ్వి---- ఎంత సరళ0గా చెప్పారు..!