12, జూన్ 2014, గురువారం

వెన్నల పాపడు



ఆకాశంలో వెన్నెల కింద పాపడు
తన నీడతో తాను ఆడుతున్నాడు

రాగిరంగు జుట్టు కదలుతూ  గాలితో
మేఘాల నవతల తోస్తోంది

ఏ ఆచ్చాదనా లేని వాడి నల్లని దేహం
నెమరి ఈ రాత్రిని స్వాంత పరుస్తోంది

పగలంతా ఎండ కింద కాగిన నేల
తప్పటడుగుల పాదాల వీవెనలతో చల్లగా నిదురకు సిద్ధమవుతోంది

కేరింతలతో ఆడి ఆడి
అలసినా పాపడు అమ్మ పక్కకు చేరి ఆయి తాగుతున్నాడు

ఆనుకుని పడుకునే  వొంటితో
వాడు ఆకాశ విల్లు

పాలు కారిన పెదాలపై
చంద్రుడికి ఇక నుంచి పవళింపు వేళ

2 కామెంట్‌లు:

  1. పగలంతా ఎండ కింద కాగిన నేల
    తప్పటడుగుల పాదాల వీవెనలతో చల్లగా నిదురకు సిద్ధమవుతోంది....చక్కని కవితనందించారు.

    రిప్లయితొలగించండి
  2. nagaraju! neevu kkk varma ilaa dwipaadaalatho kavithvam raasthunnaru phaani inspiretionaa?---anaamadheyudu

    రిప్లయితొలగించండి