3, ఆగస్టు 2012, శుక్రవారం

చీకటికొక వేకువ వేకువకొక చీకటి

ఎక్కడో కలిసి ఉంటాం
ఈదుతూ ఈదుతూ గడ్డి పోచ ఆధారం

రోజులు కాలాలు గడచి పోయాయి
మాట జ్ఞాపకమయింది
రాసిన కవిత కాగితపు మడతల నడుమ
ఒక శీతాకలపు నిద్రగ మారి
చుట్ట చుట్టుక పడుకుంది

లోలోపల కుహరాల్లో ఎక్కడో
లుప్తమవుతూ మెల్లగ ఇంకిపోయే జీవితం

ఖండితమైన తోక కొట్ట కొసల అణగారిపోతూ మొండిగ మిగిలిన బల్లి సంచలిత అనుభవం  కదా కామ్రేడ్

దూరాలను కొలవడానికి ఇంకా మన మధ్య ఏమి మిగిలి ఉంది

నిన్నూ నన్నూ కలిపి
భోంచేసిన కొండచిలువ బొజ్జలో
అంతా ఒక్కటిగ కరిగి పోయే సుఖ శాశ్వత నిద్రల బీభత్స శాంతి
ఇక ఈ రోజుకి  


 

1 కామెంట్‌:

  1. "రోజులు కాలాలు గడచి పోయాయి
    మాట జ్ఞాపకమయింది
    రాసిన కవిత కాగితపు మడతల నడుమ
    ఒక శీతాకలపు నిద్రగ మారి
    చుట్ట చుట్టుక పడుకుంది"
    చాలా నచ్చిందండి!

    రిప్లయితొలగించండి